News November 10, 2024

బుమ్రాకు కెప్టెన్సీ చేసే సత్తా ఉంది: పాంటింగ్

image

రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టును సమర్థవంతంగా లీడ్ చేయగలిగే సత్తా బుమ్రాకు ఉందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా సీనియర్ బౌలర్. ఎప్పుడు బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ బాధ్యతలను బ్యాలన్స్ చేయగలడు. కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు కూడా అతనికి అందుబాటులో ఉంటారు’ అని చెప్పారు. AUSతో తొలి టెస్టులో రోహిత్ ఆడకపోవచ్చని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 8, 2026

బాపట్లకు రూ.4,555 కోట్ల పెట్టుబడులు: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో రూ.4,555 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 20 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభపరిణామమని వినోద్ కుమార్ అన్నారు. పెట్టుబడిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించామని, ఆర్-1 విభాగంలో రూ.50 కోట్లతో ఒక పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించాయన్నారు. దీని ద్వారా సుమారు 300 మందికి ఉపాధి లభిస్తుందని, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి ఇదొక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

News February 8, 2026

TODAY HEADLINES

image

⋆ AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
⋆ క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్: CM చంద్రబాబు
⋆ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు SEC సన్నాహాలు
⋆ TG: కేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: CM రేవంత్
⋆ KCRపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్‌కు లేదా: కిషన్ రెడ్డి
⋆ రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR
⋆ పెరిగిన బంగారం, వెండి ధరలు
⋆ టీ20 WC: USAపై భారత్ విజయం

News February 8, 2026

బాబర్ ఆజంను దాటేసిన సూర్యకుమార్

image

ముంబై వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. USతో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లోనే 84 (నాటౌట్) రన్స్‌తో అదరగొట్టిన అతడు.. బాబర్ ఆజం రికార్డును తుడిచిపెట్టేశారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. 2021లో భారత్‌పై బాబర్ చేసిన 68 రన్స్ రికార్డును దాటి క్రిస్ గేల్ (88) తర్వాతి స్థానంలో ఉన్నారు.