News January 28, 2025

ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా

image

భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపికయ్యారు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డును బుమ్రా గెలుచుకున్నట్లు ICC పేర్కొంది. ఈ అవార్డుకు ఎంపికైన ఐదో భారత ప్లేయర్‌గా ఆయన నిలిచారు. అంతకుముందు ద్రవిడ్, సచిన్, అశ్విన్, కోహ్లీ ఉన్నారు. బుమ్రా గతేడాది టీ20 WCలో 15 వికెట్లు, టెస్టుల్లో 71 వికెట్లు తీశారు. ప్రస్తుతం టెస్టుల్లో నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.

Similar News

News November 25, 2025

పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

image

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.

News November 25, 2025

డిసెంబర్ 6న డల్లాస్‌లో మంత్రి లోకేశ్ పర్యటన

image

AP: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేశ్ DEC 6న USలోని డల్లాస్‌లో పర్యటించనున్నారు. గార్లాండ్ కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో జరిగే భారీ సభలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధికి చేయూత ఇవ్వాలని వారిని కోరనున్నారు. ఈ సభకు US, కెనడా నుంచి 8,000 మంది వస్తారని అంచనా. దీని తర్వాత 8, 9 తేదీల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవుతారు.