News January 14, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా

image

BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్‌లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.

Similar News

News February 3, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

image

<>ఆయుష్ <<>>మంత్రిత్వశాఖ 6 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MBA, PG/M.Phil/PhD, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. జీతం నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 3, 2026

ఒకే దేవుడికి చెందిన విగ్రహం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదా?

image

అలా ఉన్నా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కంటే భక్తే ముఖ్యం. అయితే వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీపారాధన చేస్తూ ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ అదనంగా విగ్రహాలను ఉంచడం ఇష్టం లేకపోతే వాటిని దేవాలయాలకు దానం చేయవచ్చు. శుభ్రమైన వస్త్రంలో చుట్టి భద్రపరచవచ్చు. అయితే విరిగిన/పాడైన విగ్రహాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. పవిత్రమైన చెట్ల కింద లేదా దేవాలయాల వద్ద ఉంచడం శ్రేయస్కరం.

News February 3, 2026

అంబటి ఇంటిపై దాడి ఘటన.. TDP నేతలపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో TDP నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం PSలో టీడీపీ కార్పొరేటర్‌ ఇసుక బుజ్జి సహా పలువురిపై కేసు పెట్టారు. ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంబటిని కస్టడీకి ఇవ్వాలని నల్లపాడు పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.