News March 15, 2025
బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్‌గ్రాత్

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్‌లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్‌కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.
News November 12, 2025
దారుణం.. ఉల్లి ధర కేజీ రూపాయి

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. మాల్వాలో నిన్న KG ఆనియన్ ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సౌర్లో రూపాయికి పతనమైంది. భారీగా ఉల్లి నిల్వలు ఉండగా కొత్త పంట మార్కెట్లో రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. 30 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు ₹2K చెల్లిస్తే.. క్వింటాల్‌కు ₹250 వచ్చిందని రత్లాం మార్కెట్లో మొఫత్‌లాల్ అనే రైతు వాపోయారు. ఉల్లికి MSP కల్పించాలని కోరుతున్నారు.
News November 12, 2025
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: CM

AP: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ లక్ష్యమని CM చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి దీనిని సాకారమయ్యేలా చూస్తామన్నారు. అన్నమయ్య(D) దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. YCP హయాంలో 4 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేశారని, ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.900కోట్లను ఎగ్గొట్టారని విమర్శించారు.


