News January 8, 2025

టెస్టు కెప్టెన్‌గా బుమ్రా సరికాదు: కైఫ్

image

టెస్టుల్లో కెప్టెన్ రోహిత్‌కు వారసుడిగా బుమ్రా సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్ అయితే సరిగ్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రాహుల్, పంత్‌లో ఆ లక్షణాలున్నాయని, వారిద్దరికీ ఐపీఎల్‌లో సారథ్యం వహించిన అనుభవం ఉందని తెలిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బౌలింగ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

image

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

News November 28, 2025

హనుమాన్ చాలీసా భావం – 23

image

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 28, 2025

APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncpor.res.in/