News November 22, 2024
రహానే సరసన బుమ్రా నిలుస్తారా?
AUS గడ్డపై కెప్టెన్సీ చేసిన తొలి టెస్టులో గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రహానే పేరిట రికార్డు ఉంది. నేడు ప్రారంభం కానున్న BGT తొలి టెస్టులో భారత్ గెలిస్తే రహానే సరసన బుమ్రా చేరనున్నారు. AUSలో బుమ్రాకు కెప్టెన్‌గా ఇదే ఫస్ట్ టెస్ట్. కాగా గతంలో అమర్నాథ్, చందు బోర్డే, పటౌడీ, బిషన్, గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కోహ్లీ AUSలో కెప్టెన్‌గా తమ తొలి టెస్టులో ఓడారు.
Similar News
News November 22, 2024
PAC ఎన్నికపై మండలిలో నిరసన
AP: పీఏసీ ఎన్నికపై శాసనమండలిలో YCP సభ్యులు నిరసన తెలిపారు. వేరే సభలో అంశం ఇక్కడ వద్దని మండలి ఛైర్మన్ వారిని వారించారు. దీంతో వారు మండలి నుంచి వాకౌట్ చేశారు. జగన్ ఎందుకు ఓటింగ్‌కు రాలేదని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. ఎందుకు వాకౌట్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరారు. అటు అసెంబ్లీలో వివిధ కమిటీ సభ్యుల ఎన్నికకు ఇప్పటి వరకు 163మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సీఎం చంద్రబాబు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
News November 22, 2024
విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ&రేటింగ్
మెకానిక్‌గా పనిచేసే హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే సినిమా. థ్రిల్లింగ్ ట్విస్టులతో సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. కథలో తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి అభిమానుల్లో పెంచారు. విశ్వక్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్టాఫ్‌లో ఊహించే సన్నివేశాలు, స్లోగా సాగడం, కామెడీ పండకపోవడం, క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.5/5
News November 22, 2024
అదానీ షేర్లు: నష్టాల్లోంచి క్షణాల్లో లాభాల్లోకి..
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కళకళలాడుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి రికవరీ బాట పట్టాయి. నేటి ఉదయం మోస్తరు నష్టాల్లో మొదలైన షేర్లు మొత్తంగా 6%మేర లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ (-4%) మినహా మిగిలిన 10 కంపెనీల షేర్లూ ఎగిశాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ 5%, సంఘి ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్ 4%, పవర్, గ్రీన్ ఎనర్జీ, NDTV, విల్మార్ 0.5 నుంచి 2% మేర పెరిగాయి.