News February 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం

image

ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమయ్యారని BCCI ప్రకటించింది. ఆయన స్థానంలో హర్షిత్ రానాను, జైస్వాల్ ప్లేస్‌లో వరుణ్ చక్రవర్తిని సెలక్ట్ చేసింది. జైస్వాల్, సిరాజ్, దుబే నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్‌గా ఉంటారని, అవసరమైనప్పుడు దుబాయ్‌ వెళతారని పేర్కొంది.
TEAM: రోహిత్, కోహ్లీ, గిల్, పంత్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, సుందర్, కుల్దీప్, జడేజా, హర్షిత్, షమీ, అర్ష్‌దీప్, వరుణ్.

Similar News

News January 29, 2026

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

image

రిటైర్‌మెంట్‌ ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.

News January 29, 2026

ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

image

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

News January 29, 2026

‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

image

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.