News August 15, 2025
బుమ్రాను ముఖ్యమైన మ్యాచుల్లోనే ఆడించాలి: భువనేశ్వర్

వర్క్‌లోడ్ విషయంలో బుమ్రాకు భువనేశ్వర్ మద్దతుగా నిలిచారు. ENGతో 5 టెస్టుల సిరీస్‌లో బుమ్రా మూడింట్లో మాత్రమే ఆడటంతో అతని పట్ల BCCI పక్షపాతం చూపిస్తోందన్న విమర్శలొచ్చాయి. దీనిపై భువి స్పందిస్తూ ‘ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫిట్‌గా ఉండటం కష్టం. అతడు ఏం చేయగలడో సెలక్టర్లకు తెలుసు. బుమ్రా ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటే అతడిని IMP మ్యాచుల్లోనే ఆడించాలి’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News August 15, 2025
దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అటు తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. అలాగే TGలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.
News August 15, 2025
GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?

ప్రస్తుతం <<17409983>>GST<<>>లో 5 శ్లాబ్స్ (0%, 5%, 12%, 18%, 28%) ఉండగా కేంద్రం వాటిని 2కి (5%, 18%) తగ్గించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. లగ్జరీ, సమాజానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలా లాంటి ఐటమ్స్‌ను ప్రత్యేకంగా 40% జీఎస్టీలోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5% శ్లాబ్‌లోకి, 28% శ్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చే ఛాన్స్ ఉంది.
News August 15, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. అటు, కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సా.5 గంటలకు 2,98,209 క్యూసెక్కులుగా ఉందని వెల్లడించింది.