News December 15, 2024
ఇషాంత్, జహీర్ను దాటేసిన బుమ్రా

టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ(11)రికార్డును ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో కపిల్ దేవ్ (23) ఉన్నారు. వీరి తర్వాత జవగళ్ శ్రీనాథ్ (10) కొనసాగుతున్నారు.
Similar News
News December 28, 2025
శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలివే..!

నిన్న మహిళా కమిషన్ శివాజీకి సంధించిన ప్రశ్నలు బయటకు వచ్చాయి.
*మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది మీకు తెలియదా?
*మీ కామెంట్స్ మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. మీ సమాధానం?
>తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానన్న శివాజీ.. <<18646239>>మిగతా<<>> స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.
News December 28, 2025
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్

TG: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ‘భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి. జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్’ అని ట్వీట్ చేశారు.
News December 28, 2025
మిరపలో ఆకుముడత నివారణకు చర్యలు

మిరప నారును పొలంలో నాటిన 15 రోజుల తర్వాత ప్రతి 2 వారాలకు ఒకసారి లీటరు నీటికి థయామిథాక్సామ్ 0.3గ్రా, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా., పిప్రోనిల్ గ్రాన్యూల్స్ 0.2 గ్రా, పెగాసస్ 1.5mlలలో ఏదో ఒక మందును కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు 10,000 ppm వేప మందును లీటరు నీటికి 2ml కలిపి స్ప్రే చేయాలి. ముడత వలన బలహీనపడ్డ మొక్కలకు లీటరు నీటికి 2 గ్రాముల ఫార్ములా- 4 మరియు 19:19:19ను నెల రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి.


