News September 25, 2024

టాప్-2కు దూసుకెళ్లిన బుమ్రా

image

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు దూసుకెళ్లారు. జడేజా 7 నుంచి ఆరో స్థానానికి చేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. అలాగే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 5, రిషభ్ పంత్ 6, రోహిత్ శర్మ 10, విరాట్ కోహ్లీ 12, శుభ్‌మన్ గిల్ 14వ ప్లేస్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Similar News

News September 25, 2024

AIతో భయం వద్దు: OpenAI CEO ఆల్ట్‌మాన్

image

జాబ్ మార్కెట్‌పై AI ప్రభావం చూపుతుందని న‌మ్ముతున్నట్టు OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు. అయితే కొంతమంది భయపడినంత త్వరగా లేదా తీవ్రంగా ప్ర‌భావం చూప‌బోద‌న్నారు. ఆకస్మికంగా ఉద్యోగాలేమీ పోవన్నారు. AI కార్మిక మార్కెట్లను సానుకూలంగా, ప్రతికూలంగా మార్చగలదని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. అనుకున్నదానికంటే నెమ్మదిగా ఉద్యోగాల తీరు మారుతుందని, మనం చేయాల్సిన పనులు అయిపోతాయనే భయం లేదని పేర్కొన్నారు.

News September 25, 2024

టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే..

image

టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ ఇతడే. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.

News September 25, 2024

30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు

image

బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.