News March 31, 2025
బుమ్రా బౌలింగ్‌లో ఆడటం కష్టం: పాక్ కెప్టెన్

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్ బౌలింగ్ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.
Similar News
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News April 2, 2025
శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.
News April 2, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.