News June 27, 2024
బుమ్రా బౌలింగ్ వీడియో గేమ్‌లా ఉంటుంది: అర్ష్‌దీప్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రాపై ఆయన తోటి బౌలర్ అర్ష్‌దీప్ ప్రశంసలు కురిపించారు. బుమ్రా బౌలింగ్ వీడియో గేమ్ చూసినట్లు ఉంటుందని పేర్కొన్నారు. ‘బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం చాలా సులువు. తను చాలా తక్కువ పరుగులు ఇస్తారు. దీంతో బ్యాటర్లు ఒత్తిడికి లోనై మరో బౌలర్‌కు వికెట్లు ఇస్తారు. నాకు అలా చాలా వికెట్లు వస్తున్నాయి’ అని వివరించారు. T20 WCలో ఇప్పటి వరకు అర్ష్‌దీప్ 15, బుమ్రా 11 వికెట్లు తీశారు.
Similar News
News February 4, 2026
వచ్చే నెలలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల

డైరెక్టర్ హరీశ్ శంకర్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
News February 4, 2026
U19WC: భారత్‌పై అఫ్గానిస్థాన్ భారీ స్కోర్

అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న సెకండ్ సెమీ ఫైనల్లో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌పై అఫ్గానిస్థాన్ 310/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫైజల్(110), ఉజైరుల్లా(101*) శతకాలతో చెలరేగడంతో అఫ్గాన్ పరుగుల వరద పారించింది. వారిని కట్టడి చేయడంలో IND బౌలర్లు తడబడ్డారు. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఫైనల్ చేరాలంటే భారత్ 50 ఓవర్లలో 311 రన్స్ చేయాలి.
News February 4, 2026
తొందరపాటు వ్యాఖ్యలు వద్దు.. చంద్రబాబు, పవన్ నిర్ణయం

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రెండు గంటల సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెట్టేలా YCP వ్యవహరిస్తోందన్న అంశంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ పరిస్థితుల్లో కూటమి నేతలు, క్యాడర్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.


