News July 4, 2024

రిటైర్మెంట్‌పై బుమ్రా కీలక వ్యాఖ్యలు

image

తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సంగతి తెలిసిందే. 8 మ్యాచులాడి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో బుమ్రా తొలివరుసలో ఉన్నారు.

Similar News

News November 16, 2025

తీవ్ర గాయం.. ఐసీయూలో శుభ్‌మన్ గిల్?

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ <<18294780>>మెడనొప్పితో<<>> బాధపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడి వెళ్లారు. అయితే అది తీవ్రం కావడంతో గిల్‌ను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజురీ అయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News November 16, 2025

BBCని వదలని ట్రంప్

image

మీడియా సంస్థ BBC, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఆయన మాట్లాడిన వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు BBC ఇప్పటికే <<18281054>>క్షమాపణ<<>> చెప్పింది. అయినా ఆయన వదలడం లేదు. 5 బిలియన్ డాలర్ల వరకు దావా వేస్తానని ట్రంప్ ప్రకటించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుగా ప్రసారం చేశారని, నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించారని మండిపడ్డారు. త్వరలోనే బ్రిటన్ PM స్టార్మర్‌తో మాట్లాడతానని చెప్పారు.

News November 16, 2025

ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

image

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.