News April 7, 2024
ఐపీఎల్‌లో బుమ్రా రికార్డ్

ఈరోజు ఢిల్లీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. 2 వికెట్లు తీసిన పేసు గుర్రం ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచారు. కేవలం 125 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించారు. బుమ్రా కంటే ముందు ముంబై మాజీ బౌలర్ మలింగ 105 మ్యాచుల్లో 150 వికెట్లు తీయడం గమనార్హం. ఇక RR బౌలర్ చాహల్ 118 మ్యాచుల్లో ఈ ల్యాండ్ మార్క్‌కు చేరుకున్నారు.
Similar News
News January 22, 2026
అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్‌లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్‌లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.
News January 22, 2026
అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?: కిషన్ రెడ్డి

TG: గతంలో BRS, ఇప్పుడు INC పాలనలో సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కొందరు CBI దర్యాప్తు కోరుతున్నారు. కానీ రాష్ట్ర అంశాలను CBI దర్యాప్తు చేయకూడదని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. కోల్ బ్లాక్స్ వేలం నిర్వహణకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
News January 22, 2026
WPL: ఓడితే ఇంటికే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో మ్యాచులు రసవత్తరంగా మారాయి. RCB(10 పాయింట్లు) మినహా MI, UP, DC, GG నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ జట్లన్నీ తమ తదుపరి మ్యాచులన్నీ తప్పక గెలవాలి. లేదంటే ఇంటిబాట పడతాయి. ఇవాళ యూపీ-గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ వేళ ఈ మ్యాచ్ ఇరుజట్లకూ చావో రేవో కానుంది.


