News September 23, 2024
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ పేసర్: ఆసీస్ క్రికెటర్

జస్ప్రీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫాస్ట్ బౌలరని ఆసీస్ ప్లేయర్ స్టీవ్‌స్మిత్ పొగిడారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా గెలవాలంటే ఆయనే కీలకమన్నారు. ‘కొత్త, పాత, మరీ పాత బంతుల్లో నేనెలాంటివి ఆడినా బుమ్రా ఓ అద్భుత బౌలర్. కొత్త, పాత బంతితో నైపుణ్యం ప్రదర్శిస్తారు. టెస్టు, వన్డే, టీ20ల్లో ఆయనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్. ఆయన్ను ఎదుర్కోవడం సవాలే’ అని చెప్పారు. NOV 22 నుంచి BGT మొదలవుతుంది.
Similar News
News December 23, 2025
రేపటి నుంచి సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. అటు ఏపీలో 24, 26న ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి.
News December 23, 2025
కాసేపట్లో కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ కౌంట్‌డౌన్ ఇవాళ 8.54amకు ప్రారంభం కానుంది. శ్రీహరికోటలోని షార్ 2వ ప్రయోగ వేదిక నుంచి రేపు 8.54amకు LVM3-M6 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగం మొదలైన 15.07నిమిషాల్లో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. మిషన్ సక్సెస్ కావాలని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నిన్న సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ గుడి, తిరుమలలో పూజలు నిర్వహించారు.
News December 23, 2025
నేడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే..?

మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. ‘5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి’ అంటున్నారు.


