News April 22, 2025
అట్లీ సినిమా కోసం బన్నీ కొత్త లుక్

అట్లీ- అల్లు అర్జున్ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో బన్నీపై లుక్ టెస్టుతోపాటు ఫొటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండు లుక్స్‌ను ఫైనల్ చేస్తారని టాక్. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ పలు గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్‌లో మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.
Similar News
News April 22, 2025
జెత్వానీ వేధింపుల కేసు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

AP: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు (PSR ఆంజనేయులు)ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్టైన సంగతి తెలిసిందే.
News April 22, 2025
ALERT: భక్తులకు TTD కీలక సూచన

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
News April 22, 2025
RRvsLSG: రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

IPL: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.