News March 29, 2025
ఏప్రిల్ 8న బన్నీ కొత్త సినిమా ప్రకటన?

అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో AA22 మూవీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన డబుల్ రోల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్ మేడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పుష్ప-2 బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కే చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.
Similar News
News April 1, 2025
‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.
News April 1, 2025
అసదుద్దీన్తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

TG: హైదరాబాద్లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.
News April 1, 2025
నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు