News September 27, 2024
డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ.. నిందితుల అరెస్టు

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన బిహార్ వాసులు రోషన్, ఉదయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు భట్టి విదేశీ పర్యటనకు వెళ్లగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారని తేలింది. వీరి నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 28, 2025
భారీ సైబర్ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులు

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని భయపెట్టి రూ.1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.1,05,300 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సీబీఐ అధికారులుగా నటిస్తూ వాట్సాప్లో బెదిరించినట్లు మీడియాకు తెలిపారు. ఇంతటి భారీ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులను ఎస్పీ అభినందించారు.
News November 28, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

పార్వతీపురం కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చు అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆదేశించారు.