News May 3, 2024
మండే ఎండలు.. 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

APలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇవాళ నంద్యాల(D) గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7, ప్రకాశం(D) అర్దవీడులో 47.3, వైఎస్సార్(D) చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు(D) వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీలు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు హడలెత్తించాయి. కాగా రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 169 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆ జాబితాను ఇక్కడ <
Similar News
News March 5, 2026
ఏపీలో టీనేజీ ప్రెగ్నెన్సీలు.. కారణాలివే: శైలజ

AP: <<19092441>>టీనేజీ ప్రెగ్నెన్సీల్లో<<>> ఏపీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉండటంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. SM ఆకర్షణలు, పేరెంట్స్ చదువుకోకపోవడం, అవగాహన కొరతే దీనికి కారణమన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ‘చిన్న వయసులోనే గర్భధారణను తగ్గించడానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని తెలిపారు.
News March 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 5, 2026
ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తాం.. ఇరాన్ వార్నింగ్

లెబనాన్‌లోని తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశ ఎంబసీలు అన్నింటిపై దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి ప్రకటించారు. అంతకుముందు లెబనాన్‌లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని.. ఇందుకు 24 గంటల గడుపు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేస్తోంది.


