News October 3, 2024
మండే ఎండలు.. భారీ వర్షాలు

APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
Similar News
News March 3, 2025
ALERT: మీ ఫోన్ పోయిందా?

ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే అందులోని సిమ్‌ను బ్లాక్ చేయాలని TG పోలీసులు సూచిస్తున్నారు. ఆ నంబర్‌తో లింకై ఉన్న బ్యాంకు లావాదేవీలనూ నిలిపివేయాలని చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయమవుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయని తెలిపారు. ఫోన్ నంబర్ సాయంతో ఆన్‌లైన్ మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
News March 3, 2025
వెయ్యి మందిని తొలగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. నష్టాలను తగ్గించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపుగా అన్ని శాఖలపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం కంపెనీలో 4000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023, NOVలోనూ ఓలా 500 మందిని తీసేసింది. నష్టాలు, మార్కెట్ కరెక్షన్ వల్ల 60% తగ్గిన ఓలా షేర్లు ప్రస్తుతం రూ.55 వద్ద కొనసాగుతున్నాయి.
News March 3, 2025
రోహిత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు: బీసీసీఐ

రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారని దాని ఫలితాలు కూడా చూస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.