News January 2, 2025

కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు

image

బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి HK పాటిల్ తెలిపారు. రేట్లు పెంచినా ఏపీ, తెలంగాణ, MH కంటే కర్ణాటకలోనే ఛార్జీలు తక్కువగా ఉంటాయన్నారు. కాగా, కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం రానుంది.

Similar News

News January 5, 2025

మా కులాల పేర్లు మార్చండి మహాప్రభో!

image

TG: చులకనభావంగా చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని బీసీ కమిషన్‌కు పలు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఇందులో దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలున్నాయి. వీటి స్థానంలో వేరే పేర్లను సూచించడంతో బీసీ కమిషన్ వాటిని పరిగణనలోకి తీసుకొని నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపైనా ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 18 లోపు చెప్పాలని పేర్కొంది.

News January 5, 2025

రోహిత్‌పై హీరోయిన్ ప్రశంసలు.. నెటిజన్ల సెటైర్లు

image

ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మపై బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌ ‘రోహిత్ శర్మ, వాట్ ఏ సూపర్‌స్టార్’ అని ట్వీట్ చేశారు. దీంతో ఓ నెటిజన్ ‘ముందు అతడిని ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి మేడం. తర్వాత సపోర్ట్ చేయండి’ అని సెటైర్ వేశాడు. అయితే రోహిత్ పీఆర్ టీమ్ ఆమెతో ఇలా ట్వీట్ చేయించిందని మరికొందరు ఆరోపించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను విద్యాబాలనే పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేశారని అంటున్నారు.

News January 5, 2025

విశ్వవేదికలపై మెరిసిన భారతీయ తార

image

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె విశ్వవేదికలపై భారత కీర్తిని చాటారు. 2022 ఫిఫా WC ట్రోఫీని ఆవిష్కరించి, ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఆ మరుసటి ఏడాది 2023లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కున మెరిశారు. తెలుగు సినిమా RRRలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినట్లు ఆమె స్వయంగా స్టేజీపై ప్రకటించారు. 2022లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గానూ దీపిక వ్యవహరించారు. ఇవాళ దీపిక బర్త్‌డే.