News January 25, 2025

మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు పెంపు

image

మహారాష్ట్రలో RTC బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా RTC ఛార్జీలను పెంచింది.

Similar News

News November 10, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News November 10, 2025

తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

image

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్‌కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News November 10, 2025

క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా TAR-200

image

ఎలాంటి చికిత్సకు లొంగని మూత్రాశయ క్యాన్సర్ కణతులను(Tumors) TAR-200 అనే ఔషధ పరికరం 3 నెలల్లోనే కరిగించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఇది పాత పద్ధతిలా కాకుండా, ప్రతి 3 వారాలకు నిరంతరంగా కీమో మందును విడుదల చేస్తుంది. మూత్రాశయం తొలగించాల్సిన అవసరం లేకుండా 82% మంది రోగులకు ఈ చికిత్సతో క్యాన్సర్ నయమైంది. క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన దీనికి FDA ఆమోదం తెలిపింది.