News May 10, 2024

ఓటర్లను భయపెడుతున్న బస్సు ఛార్జీలు

image

ఈ నెల 13న ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. HYD నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు RTC ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సాధారణ ఛార్జీల మీద రూ.1000- రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. HYD నుంచి VJA, విశాఖ, రాజమండ్రికి టికెట్ గరిష్ఠంగా రూ.3000 ఉంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.

Similar News

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77

image

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 25, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఇస్రో-<>విక్రమ్ <<>>సారాభాయ్ స్పేస్ సెంటర్ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 70ఏళ్లలోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News November 25, 2025

అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

image

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.