News July 12, 2024
నదిలో పడిన బస్సులు.. 63 మంది గల్లంతు!

నేపాల్లోని మదన్-ఆశ్రిత్ హైవేలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో డ్రైవర్లతో సహా 63 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ పీఎం ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 26, 2025
వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి: కలెక్టర్

ప్రజలందరికీ భాగస్వామ్యంతో వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
News November 26, 2025
రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు

ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు యశస్విని, అలేఖ్య.. బాలుర విభాగంలో విజయ్ తరుణ్, సాయికుమార్ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే 69వ ఏపీ స్కూల్ గేమ్స్ అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
News November 26, 2025
విశాఖ: అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తుల స్వీకరణ

విశాఖ నగరంలో 1985 నుండి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.


