News January 9, 2025
సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు 10 నిమిషాలకో బస్సు

TG: రెండు రోజుల క్రితం చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను PM మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు SECBAD నుంచి మొదలయ్యే పలు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ టు చర్లపల్లికి ప్రతి 10ని. ఒక బస్సు ఉంటుందని RTC అధికారులు తెలిపారు. SECBAD బ్లూసీ వద్ద మొదలై హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, HPCL మీదుగా అక్కడికి చేరుతాయని పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
ఆగస్టు 18: చరిత్రలో ఈరోజు

1227: మంగోలియా చక్రవర్తి చెంఘీజ్ ఖాన్ మరణం
1650: స్వాతంత్ర్యోద్యమకారుడు సర్వాయి పాపన్న జననం
1868: గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసి హీలియం ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త పియర్ జూల్స్ జాన్సెన్
1945: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(ఫొటోలో)మరణం
1959: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జననం
1980: సినీ నటి ప్రీతి జింగానియా జననం
2011: ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
News August 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 18, 2025
శుభ్‌మన్ గిల్‌కు BCCI బిగ్ షాక్?

ఆసియా కప్ 2025 కోసం BCCI ప్రకటించే భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రణాళికల్లో ఆయన లేకపోవడమే ఇందుకు కారణమని టాక్. అతడికి బదులు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ప్లేయర్లలో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం కూడా గిల్‌ను పక్కన పెట్టేందుకు మరో కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.