News April 24, 2024
భారత్లో 14ఏళ్ల గరిష్ఠానికి వ్యాపార కార్యకలాపాలు!

భారత్లో వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈనెలలో వ్యాపార కార్యకలాపాలు 14ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. మార్చి నెలలో 61.8గా ఉన్న వ్యాపార కార్యకలాపాల సూచీ ఈనెలలో 62.2కు చేరినట్లు HSBC పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) వెల్లడించింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లు రాణించడమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. 800 సంస్థలపై సర్వే చేపట్టి ఈ విషయాలు వెల్లడించింది.
Similar News
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.
News November 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 7, 2025
సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


