News January 28, 2025

బంగారం కొనుగోళ్లకు EMI ఉండాలి.. కేంద్రాన్ని కోరిన వ్యాపార వర్గాలు

image

బంగారం ధరలు భారీగా పెరుగుతుండ‌డంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు కొనుగోళ్ల‌కు వెన‌క‌డుగు వేస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని EMI పద్ధతి ద్వారా బంగారు ఆభరణాల కొనుగోలుకు అనుమతించాలని వ్యాపార వ‌ర్గాలు కోరుతున్నాయి. ఈ కొత్త విధానాన్ని బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలని, అలాగే దేశీయంగా గోల్డ్ మార్కెట్ నియంత్ర‌ణ‌కు ఒక్క‌టే రెగ్యులేట‌రీ బాడీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.

Similar News

News November 20, 2025

MDK: పెన్షన్ల పెంపు ఇంకెన్నడో ?

image

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ప్రచార సభలో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావొస్తున్నా పెన్షన్ పెంపు ముచ్చట లేదు. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000 దివ్యాంగులకు రూ.6,000 వరకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురు చూస్తున్నారు.

News November 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 20, 2025

బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.