News December 11, 2024
పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఓడించగలం కానీ.: అమెరికా

చైనాను ఓడించడం తమకు సాధ్యమేనని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ స్పష్టం చేశారు. కానీ సాంకేతికంగా డ్రాగన్పై తమకున్న పైచేయి క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్షిపణి టెక్నాలజీ, సమాచార వ్యవస్థలపై US ప్రధానంగా దృష్టి సారించాలి. సైబర్ దాడుల్ని తట్టుకునేలా ఆ సమాచార వ్యవస్థ ఉండాలి. క్షిపణులకు చాలా ఖర్చవుతోంది. పోరాటాల్లో వాటి బదులు డ్రోన్లను వాడాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
పెగడపల్లి: నానమ్మ మందలించిందని యువకుడు సూసైడ్

ఏం పని చేయకుండా ఊరికే ఉంటున్నావని నానమ్మ మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెగడపల్లి మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నీలం అరవింద్ (23) బీటెక్ పూర్తి చేశాడు. ఏం పని చేయడం లేదని నానమ్మ మందలించడంతో బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 4, 2025
మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.
News December 4, 2025
నిర్మాత మృతి.. హీరో సూర్య కన్నీళ్లు

ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) <<18464480>>భౌతికకాయానికి<<>> సీఎం స్టాలిన్, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివ దేహాన్ని చూస్తూ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థే తెరకెక్కించింది. కాగా శరవణన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.


