News March 16, 2024

ధోనీ, కోహ్లీ ఫాలోయింగ్‌పై బట్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

కెప్టెన్ కూల్ MS ధోనీ, కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్‌లో ధోనీ, కోహ్లీ మైదానంలో నడిస్తే చాలు ఫ్యాన్స్ అంతా టైలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో పదేళ్ల పిల్లల్లా మారిపోతారు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ నమ్మశక్యం కానిది. వారు కేవలం మైదానంలోకి వస్తే చాలు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేస్తారు’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News April 6, 2025

మా చిత్రాన్ని విజయవంతం చేయండి: సిద్ధు, వైష్ణవి 

image

ఈనెల 10న తమ లేటెస్ట్ సినిమా “జాక్” థియేటర్లలో రిలీజ్ అవుతోందని, మూవీని ఆదరించాలని హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రేక్షకులను కోరారు. శనివారం ఈ సినీ నిర్మాత DVS ప్రసాద్‌తో కలసి విజయవాడలో వారు మాట్లాడుతూ..”జాక్”లో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. 

News April 6, 2025

శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకంటే?

image

శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

News April 6, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు GOOD NEWS

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

error: Content is protected !!