News August 1, 2024
బంగారం కొంటారా: US ఫెడ్ పంపిన సిగ్నల్స్ ఇవే

గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! సెప్టెంబర్లో వడ్డీరేట్ల తగ్గింపుపై US ఫెడ్ సిగ్నల్స్ ఇచ్చింది. అప్పుడు ధర ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే బంగారం, డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే మరోటి తగ్గుతుంది. వడ్డీరేట్ల కోతతో పుత్తడి మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. యుద్ధాలు, జియో పాలిటిక్స్ వల్ల భారత్, చైనా టన్నుల కొద్దీ గోల్డ్ కొంటున్నాయి. కస్టమ్స్ సుంకం తగ్గడంతో యెల్లో మెటల్ డిమాండ్ పెరగడం ఖాయం.
Similar News
News January 23, 2026
వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.
News January 23, 2026
APPLY NOW: SACONలో 36 పోస్టులు

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<
News January 23, 2026
వసంత రుతువులో ప్రకృతి ఎందుకు పులకరించిపోతుందో తెలుసా?

వసంత పంచమికి, ప్రేమ దేవుడు మన్మథుడితో సంబంధం ఉంది. శివుడి ధ్యానాన్ని భంగం కలిగించి, పార్వతీ దేవిపై ఆయనకు అనురాగం కలిగేలా చేయడానికి మన్మథుడు పూబాణాలు ప్రయోగించిన రోజు ఇదేనట. దీంతో శివుడు మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి వేడుకోలుపై తిరిగి ప్రాణం పోశాడు. ఈ కాలంలో కొత్త చిగుళ్లతో ప్రకృతి పులకించేలా చేసేది మన్మథుడని నమ్ముతారు. అందుకే ఈరోజును ప్రేమకు, సృజనాత్మకతకు ప్రతీకగా చెబుతారు.


