News November 27, 2024
కారు కొంటున్నారా? ఈ విషయం తెలుసా?

ఇండియాలో కార్ల ధరలో సగం పన్నులే అని మీకు తెలుసా? GST 28%, సెస్ 17% ఎక్స్-షోరూం ధరలో కలిసి ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ 15-20%, ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీ విధిస్తారు. కారు రేటు రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అదనంగా 1% TCS ఉంటుంది. ఉదాహరణకు ఓ కారు ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షలు ఉంటే అందులో రూ.3.11 లక్షలు పన్నులే (28% జీఎస్టీ+17% సెస్) ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ కింద రూ.2 లక్షలు చెల్లించాలి.
Similar News
News October 24, 2025
నేడు..

* ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్‌లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్‌డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక
News October 24, 2025
ఇంటర్వ్యూతో NIRDPRలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ఎర్త్& ఎన్విరాన్మెంటల్ సైన్స్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.50వేలు చెల్లిస్తారు. http://career.nirdpr.in
News October 24, 2025
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదా?

గరుడ పురాణంలో నరకం, పాపుల శిక్షల గురించి నిక్షిప్తంగా ఉంటుంది. ఇందులో ‘ప్రేతకల్పం’ ఉండటం వలన దీనిని ఇంట్లో చదవవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ పురాణాన్ని మిగిలిన పురాణాల మాదిరిగానే ఇంట్లో చదువొచ్చని పండితులు చెబుతున్నారు. ఇందులోని జ్ఞానం మనిషిని సత్కర్మల వైపు నడిపిస్తుందని అంటున్నారు. ఇతరులకు బహూకరించేటప్పుడు దీనిని హంస ప్రతిమతో ఇవ్వడం శుభప్రదమని సూచిస్తున్నారు.<<-se>>#DHARMASANDEHALU<<>>


