News May 22, 2024

40ల్లో ఇల్లు కొంటున్నారా?

image

40ఏళ్ల వయసులో ఇల్లు కొనాలనుకునేవారు ఆర్థిక స్థిరత్వం, ఎమర్జెన్సీ ఫండ్స్ మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్‌ మంజూరు సులభం అవుతుంది. లొకేషన్, ఇంటి రీసేల్ వాల్యూను పరిశీలించడమే కాక ఎన్‌కమ్బరెన్స్ సర్టిఫికెట్ ద్వారా ప్రాపర్టీలో లొసుగులు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. EMI భారం పడకుండా డౌన్‌పేమెంట్ 20% లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తే మంచిదనేది నిపుణుల సలహా.

Similar News

News September 19, 2025

నేడు ఒమన్‌తో భారత్ మ్యాచ్

image

ఆసియా కప్‌లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్‌తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్‌-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.

News September 19, 2025

రాబోయే 4 రోజులు వర్షాలు

image

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

News September 19, 2025

నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

image

AP: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.