News March 16, 2024
ఏసీలు కొంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
* రూమ్ సైజుకు తగిన సామర్థ్యం ఉన్న ఏసీ తీసుకోవాలి. 110 sq ft గదికి 1 టన్ను కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది.
* ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొంటే కరెంటును ఆదా చేస్తుంది.
* స్టెబిలైజర్ కూడా తీసుకోవాలి. ఏసీ పాడవకుండా ఉంటుంది.
* కనీసం ఐదేళ్ల పీసీబీ వారంటీ, పదేళ్ల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్నవి కొనడం ఉత్తమం.
* ఈ కామర్స్ సంస్థలు, డీలర్ల వద్ద కొనేముందు ధరల మధ్య తేడాను గమనించాలి.
Similar News
News November 24, 2024
రాజ్ థాక్రేకు భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.
News November 24, 2024
111 కోట్ల జీరో టికెట్లు జారీ: మంత్రి పొన్నం
TG: తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఈ నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి చేరిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక TGSRTC ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
News November 24, 2024
IPL: మెగా వేలానికి వేళాయే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ, రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
* మొత్తం స్లాట్స్: 204 * వేలంలో పాల్గొనేవారి సంఖ్య: 577
* భారత ప్లేయర్లు: 367 మంది * విదేశీ ప్లేయర్లు: 210 మంది
* అత్యంత పెద్ద వయస్కుడు: అండర్సన్(ENG)
* పిన్న వయస్కుడు: వైభవ్ సూర్యవంశి(బిహార్)
* లైవ్: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్, IPL వెబ్సైట్