News November 21, 2024

ఆన్‌లైన్‌లోనే డ్రగ్స్ కొంటున్నారు.. నిషేధించండి: సుప్రియా

image

ఆన్‌లైన్‌లో ఔషధాలు ఆర్డర్ చేసే సదుపాయాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుతున్నారని TN హెల్త్ సెక్రటరీ సుప్రియా సాహు DCGIకి సూచించారు. చట్టాలను ఉల్లంఘించి డ్రగ్స్, టపెంటడోల్‌ను విక్రయించే వెబ్‌సైట్స్‌ను నిషేధించాలని ఆమె లేఖ రాశారు. ఆన్‌లైన్ ద్వారానే నేరస్థులు డ్రగ్స్ కొంటున్నారని పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 24, 2026

T-Hub స్టార్టప్స్ కోసమే.. ఆఫీసులు వద్దు: CM రేవంత్

image

TG: T-Hubను కేవలం స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను దాంట్లోకి మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై US పర్యటన నుంచే స్పందించారు. T-Hub ఒక ఇన్నోవేషన్ సెంటర్ అని, అక్కడ ఇతర ఆఫీసులు ఉండొద్దని సూచించారు. అద్దె ఆఫీసుల కోసం ఇతర ప్రభుత్వ భవనాలను వెతకాలని, T-Hub ప్రాధాన్యాన్ని దెబ్బతీయొద్దని తెలిపారు.

News January 24, 2026

ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’

image

యంగ్ హీరో రోషన్ నటించిన ‘ఛాంపియన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix ప్రకటించింది. మూవీలో రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్ నటించారు. స్వప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన మూవీ DEC 25న రిలీజైన విషయం తెలిసిందే. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘గిరగిర’ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

News January 24, 2026

గ్రీన్‌లాండ్‌లో పెంగ్విన్‌లా? ట్రంప్‌పై నెటిజన్ల ట్రోలింగ్

image

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్ పెంగ్విన్‌తో ఉన్న AI ఫొటోను వైట్‌హౌస్ Xలో షేర్ చేసింది. అయితే గ్రీన్‌లాండ్‌ ఉండే ఉత్తరార్ధ గోళంలో పెంగ్విన్లు అసలు ఉండవని, అవి కేవలం అంటార్కిటికా వంటి దక్షిణార్ధ గోళంలోనే ఉంటాయంటూ నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. దావోస్‌లో జరిగిన భేటీలో యూరప్ దేశాలపై టారిఫ్ మినహాయింపులు ఇస్తూ గ్రీన్‌లాండ్‌పై ఒప్పందానికి ట్రంప్ మొగ్గు చూపారు.