News August 12, 2025
ముగిసిన ఉపఎన్నిక పోలింగ్

AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 70శాతం పోలింగ్ రికార్డయింది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News August 16, 2025
ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ ఆడొద్దు: హర్భజన్

ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచును భారత్ బాయ్‌కాట్ చేయాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ‘క్రికెట్ కంటే దేశం కోసం సైనికులు చేసే త్యాగం గొప్పది. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేదేం లేదు. ఇది చాలా చిన్న విషయం. అన్నింటికంటే దేశమే ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడితే సైనికుల త్యాగాలను ఎగతాళి చేసినట్లవుతుంది’ అని అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ SEP 5న UAE వేదికగా ప్రారంభం కానుంది. IND, PAK 14న తలపడనున్నాయి.
News August 16, 2025
ఫ్రీ బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి మహిళా సాధికారత చాటండి: మంత్రి లోకేశ్

AP: రాష్ట్రంలో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి #FREEbusTicketSelfie అనే ట్యాగ్‌తో SMలో పోస్ట్ చేయాలని కోరారు. ‘సోదరీమణులారా.. ఈ ప్రయాణాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకోండి’ అని పేర్కొన్నారు. ఇది స్వాతంత్ర్యం, సమానత్వంతో కల్పించిన అవకాశమన్నారు. ‘స్త్రీశక్తి’తో మహిళలకు సాధికారత కల్పించడం పట్ల గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
News August 16, 2025
SBI హోం లోన్ వడ్డీ రేట్లు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోం లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటివరకు గృహ రుణ రేట్లు 7.50% నుంచి 8.45%గా ఉండగా, తాజా నిర్ణయంతో 7.50% నుంచి 8.70 శాతానికి పెంచింది. ఆగస్టు 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఎస్బీఐ తెలిపింది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి ఈ పెంచిన రేట్లు వర్తించవని, కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది.