News September 5, 2025
పులివెందులకు ఉపఎన్నిక ఖాయం: రఘురామ

AP: ఈసారి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్‌క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉపఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓ MLA 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఆయన తెలిపారు. ‘మాజీ CM అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా. ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
Similar News
News September 7, 2025
క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రెండు కమిటీలు

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.
News September 7, 2025
సౌతాఫ్రికా ఘోర ఓటమి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో SA ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్‌ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో SA ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.
News September 7, 2025
రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.