News December 17, 2024
దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికలు: ఉద్ధవ్

దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు తెచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనలను అమలు చేసే ముందు దేశంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు నాగ్‌పూర్‌లో జరుగుతున్న MH అసెంబ్లీ సమావేశాల సందర్భంగా CM ఫడణవీస్‌ను ఉద్ధవ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


