News March 27, 2025
కేసీఆర్ దిగిపోయే నాటికి రూ.8.19 లక్షల కోట్ల అప్పు: CM రేవంత్

TG: కేసీఆర్ దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే రూ.8.19 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. తాము 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేశామని, ఇందులో రూ.1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని స్పష్టం చేశారు. కూలిపోయిన కాళేశ్వరానికి కూడా రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించామన్నారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుభరోసా పథకాలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు.
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.