News March 19, 2025
BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.
Similar News
News March 19, 2025
పాత కార్లు ఉంటే దెబ్బేనా?

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.
News March 19, 2025
ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం: భట్టి

TG: గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
News March 19, 2025
విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: లోకేశ్

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.