News June 27, 2024
బైజూస్ మాకు ₹13 కోట్లు బాకీ ఉంది: ఒప్పో

తమ ఫోన్లలో బైజూస్ యాప్ ప్రీఇన్‌స్టాల్ చేసినందుకు ఆ సంస్థ తమకు ₹13కోట్లు బాకీ ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌కు ఒప్పో తెలియజేసింది. బైజూస్ ప్రమోటర్లు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. కాగా విచారణను జులై 3కు వాయిదా వేసిన NCLT ఆ రోజును ‘బైజూస్ డే’గా పేర్కొంది. బైజూస్‌పై దాఖలైన 10 పిటిషన్ల విచారణ ఆ రోజు జరగనుండటమే కారణం.
Similar News
News October 30, 2025
కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.
News October 30, 2025
టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

టెస్టుల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుంచి 2 టీ బ్రేక్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ సెషన్ 9-11am, సెకండ్ సెషన్ 11-20am-1.20pm, మూడో సెషన్ 2-4pmగా ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. లంచ్‌కు ముందు ఒకటి, తర్వాత మరో టీ బ్రేక్ అమల్లోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న సంగతి తెలిసిందే.
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

TG: అజహరుద్దీన్ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.


