News February 14, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.
Similar News
News February 14, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: 8 L మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. GPF ఖాతాలను ఆన్‌లైన్ చేసి NIDHI ప్లాట్‌ఫామ్‌తో స్ట్రీమ్‌లైన్ చేసింది. ఇదివరకు సొమ్ము మాయం, విత్‌డ్రాలో జాప్యం, రిటైర్మెంటు బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్మెంటు, DA బకాయిలు, GLICకీ అనేక సమస్యలుండేవి. ఆఫ్‌లైన్‌తో ఖాతాలో ఎంతుందో తెలిసేది కాదు. ఇప్పుడు పారదర్శకంగా డ్యాష్ బోర్డు ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఆన్‌లైన్లోనే అప్లయ్ చేయొచ్చు.
News February 14, 2026
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ!

TG: కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరనుంది. గద్వాల(D) వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఎనిమిది మంది ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వారు కండువా కప్పుకోనున్నారు. దీంతో మొత్తం 67 మున్సిపాలిటీలు హస్తగతమవుతాయి. కాగా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుతో ఏఐఎఫ్‌బీ గెలిచినట్లు వార్తలు రాగా ఆ పార్టీ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు ఖండించిన విషయం తెలిసిందే.
News February 14, 2026
పనసలో కాయకుళ్లుతో కలిగే నష్టాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.


