News August 30, 2025
C ఫర్ కాంగ్రెస్/చీటింగ్/చోరీ: కేటీఆర్

TG: సీ ఫర్ కాంగ్రెస్, చీటింగ్, చోరీ అంటూ BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. వాళ్లకు తెలిసిన నంబర్ ‘420’ అని సెటైర్లు వేశారు. ‘మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్, తులం బంగారం, టూ వీలర్స్, కోటీశ్వరులను చేస్తామని హామీలు ఇచ్చారు. మహిళల జీవనోపాధిని లాక్కుంటున్నారు. ఇళ్లను నేలకూలుస్తున్నారు. ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్. ఒక్క ఓటు మూల్యం ఐదేళ్లు’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News August 30, 2025
దుబాయ్‌లో ఎండలు.. ఐసీసీ కీలక నిర్ణయం?

ఆసియా కప్ మ్యాచుల ప్రారంభ సమయాన్ని ICC మార్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మ్యాచులకు గానూ 18 మ్యాచులకు సమయం మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ప్రతీ మ్యాచ్ రా.8 గంటలకు ప్రారంభం కానుంది. టైమింగ్స్ మార్పునకు ఎండ తీవ్రతలే కారణమని తెలుస్తోంది. దుబాయ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ICC ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News August 30, 2025
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే: కోమటిరెడ్డి

TG: రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై గొప్పగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో వివరణ ఇవ్వాలని, ఆయన రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని తెలిపారు. కమిషన్ నివేదికకు భయపడే KCR మళ్లీ కోర్టుకు వెళ్లారన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా పేరుతో BRS రాజకీయం చేస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు.
News August 30, 2025
బాబు కడితే ఇల్లా.. జగన్ కడితే ప్యాలెసా?: గుడివాడ

AP: <<17552693>>రుషికొండ<<>>లో Dy.CM పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ ఫొటోలు దిగారని ఆయన ఆరోపించారు. ‘రుషికొండ భవనాలను వాడుకునేందుకు చంద్రబాబు, పవన్, లోకేశ్ పోటీపడుతున్నారు. చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు కడితే అది పూరి గుడిసె. కానీ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెసా’ అని ఆయన ఫైర్ అయ్యారు.