News September 11, 2025

గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా

image

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రేపు ఆయన ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Similar News

News September 11, 2025

పలు జిల్లాల కలెక్టర్లు బదిలీలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం 12జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
* మన్యం- ప్రభాకర్ రెడ్డి, * విజయనగరం- రామసుందర్ రెడ్డి
* తూ.గో.- కీర్తి చేకూరు, * గుంటూరు- తమీమ్ అన్సారియా
* పల్నాడు- కృతిక శుక్లా, * బాపట్ల- వినోద్ కుమార్
* ప్రకాశం- రాజాబాబు, * నెల్లూరు- హిమాన్షు శుక్లా
* అన్నమయ్య- నిషాంత్ కుమార్, * కర్నూలు- ఎ.సిరి
* అనంతపురం- ఆనంద్, * సత్యసాయి- శ్యామ్ ప్రసాద్

News September 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

News September 11, 2025

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

image

TG: BRS అధినేత KCR స్వగ్రామమైన సిద్దిపేట(D) చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వచ్చి ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆహ్వానించారు. ‘గొప్ప ఉద్యమకారుడిని కన్న ఊరు మా చింతమడక. పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు’ అని కవిత అన్నారు.