News August 26, 2025

C.R.S.పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి: కమిషనర్

image

జీవీఎంసీ పరిధిలోని అన్ని ఆసుపత్రులు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (C.R.S.) పోర్టల్ లో జనన, మరణ వివరాలను నమోదు చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. దీనికోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం నుండి యూజర్ ఐడీలను తీసుకోవాలన్నారు. దీనివల్ల జనన, మరణ ధ్రువపత్రాలు జారీ సులభం అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో జనన ధ్రువపత్రాలు తీసుకోవాలన్నారు.

Similar News

News August 26, 2025

విశాఖ: సమస్యలు చెప్పుకున్న 54 మంది మహిళలు

image

సమస్యలతో బాధపడే మహిళలకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆమె మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. 54 మంది మహిళలు తమ సమస్యలను వివరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు న్యాయపరమైన సేవలు అందించాలన్నారు. భరణం వచ్చేలా చూడాలని, స్వయం ఉపాధి కోసం సహకరించాలని కోరారు.

News August 26, 2025

విశాఖ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

image

తూర్పు నౌకాదళంలో 2 యుద్ధ నౌకలు ప్రారంభించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, సీపీ శంఖబ్రత బాగ్చీ, నేవీ తూర్పు నౌకదళ ప్రధాని అధికారి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకొని 2 యుద్ధ నౌకలను మంత్రి ప్రారంభిస్తారు.

News August 26, 2025

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు: పల్లా శ్రీనివాస్

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ నష్టాలకు కారణాలను వివరించారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయడానికి టన్నున్నర ముడిసరుకు అవసరం అన్నారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడమే నష్టాలకు ప్రధాన కారణం అన్నారు.