News December 31, 2024

టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించిన CA

image

క్రికెట్ ఆస్ట్రేలియా(CA) 2024కు గానూ 11 మంది ప్లేయర్లతో మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. భారత్ నుంచి బుమ్రా, జైస్వాల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అనూహ్యంగా బుమ్రాను ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ప్రకటించింది.
జట్టు: జైస్వాల్(IND), బెన్ డకెట్, రూట్, హ్యారీ బ్రూక్(ENG), రచిన్ రవీంద్ర(NZ), కమిందు మెండిస్(SL), అలెక్స్ క్యారీ, హజెల్ వుడ్(AUS), హెన్రీ(NZ), బుమ్రా(IND), కేశవ్ మహారాజ్(SA).

Similar News

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 5, 2025

రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

image

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.