News July 11, 2024
సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

మేలో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులు https://icai.nic.inలో ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌లో గ్రూప్-1లో 27.15 శాతం, గ్రూప్-2లో 18.28శాతం, రెండు గ్రూపుల్లో 18.42% ఉత్తీర్ణత నమోదైంది. ఫైనల్‌లో గ్రూప్-1లో 27.35%, గ్రూప్-2లో 36.35%, రెండు గ్రూపుల్లో 19.88శాతం నమోదైంది. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ కోసం <
Similar News
News December 21, 2025
ఉద్యమాలు కాదు.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ఉత్తమ్

TG: <<18632969>>ఉద్యమాలు<<>> కాకుండా ముందుగా తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘కమీషన్ కోసం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు కట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదుల, SLBC, దిండి ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? సమాధానం చెప్పాలి. కృష్ణా జలాలపై కేంద్రంతో మేమే ఎక్కువగా పోరాడాం’ అని అన్నారు.
News December 21, 2025
తొలి T20.. భారత్ టార్గెట్ ఎంతంటే?

వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక మహిళల జట్టు 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SL బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. ఓపెనర్ గుణరత్నే(39), హర్షిత సమరవిక్రమ(21) టాప్ స్కోరర్స్. భారత బౌలర్లలో క్రాంతి, చరణి, దీప్తి తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 122.
News December 21, 2025
కేసీఆర్ వ్యాఖ్యలు 90శాతం అబద్ధం: ఉత్తమ్

TG: రాష్ట్రంలో ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు 90శాతం అబద్ధమని చెప్పారు. ‘కృష్ణా జలాల విషయంలో మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారు. రూ.1.80 లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలింది. రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ప్రజల భవిష్యత్తును గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది’ అని ఫైరయ్యారు.


