News September 20, 2024

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.

Similar News

News January 5, 2026

వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్.. ఇండియాపై ఎఫెక్ట్ ఎంత?

image

అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని GTRI రిపోర్ట్ చెప్తోంది. ఒకప్పుడు మనం అక్కడి నుంచి భారీగా ముడి చమురు కొనేవాళ్లం. కానీ అమెరికా ఆంక్షల వల్ల 2020 నుంచి అది బాగా తగ్గిపోయింది. అందుకే అక్కడి గొడవలు మన ఎకానమీ లేదా ఎనర్జీ సెక్యూరిటీపై పెద్దగా ప్రభావం చూపించవని GTRI తెలిపింది.

News January 5, 2026

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

image

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.

News January 5, 2026

అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

image

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.