News April 21, 2024

IAS అధికారుల జీతంపై CA పోస్ట్ వైరల్

image

ఐఏఎస్‌ల జీతంపై ఓ చార్టెడ్ అకౌంటెంట్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీతం తక్కువని తెలిసినా ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు? అని చిరాగ్ చౌహాన్ అనే సీఏ ట్వీట్ చేశారు. IAS అధికారుల సగటు జీతం CA ఉద్యోగులకు వచ్చే ఆరంభ వేతనంతో సమానం అని తెలిపారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘గౌరవం, ప్రజా సేవ కోసం ఐఏఎస్ అవుతారు. డబ్బు కోసం కాదు’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 21, 2026

భర్తకు తీవ్ర అనారోగ్యం.. శ్మశానంలో వదిలివెళ్లిన భార్య!

image

TG: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్‌ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.

News March 21, 2026

జెన్యూన్ హీరోలు లేరు: తాప్సీ

image

కథకు ప్రాధాన్యమిచ్చి, తమ పాత్ర పరిధి ఎంత ఉన్నా నటించే జెన్యూన్ హీరోలు ప్రస్తుతం లేరని నటి తాప్సీ అన్నారు. ‘హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉంటే నటించేందుకు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదు. హీరోయిన్ హైలైట్ అయితే తమ ఇమేజ్ దెబ్బతింటుందనేది వారి భావన. ఇలా అయితే మంచి కథలు ఎలా వస్తాయి. కథానాయికలు పాటలకే పరిమితం కావాలనే పాతకాలపు ఆలోచన నుంచి బయటికి రావాలి’ అని పిలుపునిచ్చారు.

News March 21, 2026

భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

image

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.