News December 28, 2024

CA Resluts: ఆల్ ఇండియాలో హైదరాబాదీ నం.1

image

CA ఫలితాల్లో‌ హైదరాబాద్‌ యువకుడు సత్తాచాటాడు. నగరానికి చెందిన హెరంబ్ మహేశ్వరి ఆల్ ఇండియాలో టాప్(నంబర్ 1) ర్యాంక్ సాధించారు. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో 600 మార్కులకు 84.67 శాతంతో 508 మార్కులు సాధించారు. తిరుపతి వాసి రిషబ్ కూడా 508 మార్కులతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచారు. అహ్మదాబాద్ యువతి రియా 3, కోల్‌కతా వాసి కింజల్ అజ్మేరా 4వ ర్యాంక్‌ సాధించారు.

Similar News

News January 1, 2025

HYD: సీఎంను కలిసిన మంత్రులు, MLAలు, MPలు

image

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కిరణ్ రెడ్డి, అనిల్ కుమార్, మల్లు రవి, ఎమ్మెల్యేలు, అద్దంకి దయాకర్ , కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

News January 1, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. తాజాగా RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 32000 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మన సికింద్రాబాద్ రీజియన్‌లోనూ ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్‌‌లో రైల్వే శాఖ పేర్కొంది. స్టార్టింగ్ శాలరీ రూ. 18000 ఉంటుంది. 18-36 ఏళ్లు గలవారు అర్హులు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT

News January 1, 2025

HYD: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. ఊదితే 550

image

HYD‌లో ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి ఫలితం చూసి పోలీసులే షాకయ్యారు. పూర్తి వివరాలు.. నిన్న రాత్రి పంజాగుట్టలో పోలీసులు ఓ బైకర్‌ను ఆపి చెక్ చేశారు. బ్రీత్ అనలైజర్‌లో ఏకంగా 550 మీటర్ నమోదు కావడం గమనార్హం. బైక్‌ను సీజ్ చేసి మందుబాబుకు రిసిప్ట్ ఇచ్చి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఎంత తాగావు బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.