News December 28, 2024
CA Resluts: ఆల్ ఇండియాలో హైదరాబాదీ నం.1
CA ఫలితాల్లో హైదరాబాద్ యువకుడు సత్తాచాటాడు. నగరానికి చెందిన హెరంబ్ మహేశ్వరి ఆల్ ఇండియాలో టాప్(నంబర్ 1) ర్యాంక్ సాధించారు. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో 600 మార్కులకు 84.67 శాతంతో 508 మార్కులు సాధించారు. తిరుపతి వాసి రిషబ్ కూడా 508 మార్కులతో టాప్ ర్యాంక్‌లో నిలిచారు. అహ్మదాబాద్ యువతి రియా 3, కోల్‌కతా వాసి కింజల్ అజ్మేరా 4వ ర్యాంక్ సాధించారు.
Similar News
News December 29, 2024
OU: MBA కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్- డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా, రూ.300 లేట్ ఫీతో 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.

HYD: తెలంగాణ క్రికెటర్లు త్రిష, దృతిలకు HCA సన్మానం
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతిలను ఉప్పల్ స్టేడియంలో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు సన్మానించి, అభినందించారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవ‌్వడం గర్వంగా ఉందన్నారు.